ప్రజాశక్తి- పంగులూరు (బాపట్ల) : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా కారు దగ్ధమైన సంఘటన శుక్రవారం ఉదయం మండలంలోని భగవాన్ రాజుపాలెం గ్రామం వద్ద పెట్రోల్ బంక్ ఎదురుగా జాతీయ రహదారిపై జరిగింది. నేషనల్ హైవే సిబ్బంది వివరాల ప్రకారం … ఒంగోలు కోర్టు సెంటర్ కి చెందిన కారు షోరూం మేనేజర్ డి.శివకుమార్ శుక్రవారం ఉదయం ఒంగోలు నుండి గుంటూరు వైపు కారులో వెళుతున్నారు. ఉదయం 8:15 గంటల సమయంలో కారు మండలంలోని భగవాన్ రాజుపాలెం ఫ్లైఓవర్ దిగుతుండగా విద్యుత్ సార్క్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. వెంటనే కారు నడుపుతున్న శివకుమార్ రోడ్డు పక్కకు కారును పెట్టి కారు దిగాడు. అద్దంకి నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. కారులో శివకుమారు ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి ప్రమాదము లేదనీ హైవే అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.