ప్రజాశక్తి- సంతమాగులూరు: మండలంలోని పుట్టావారిపాలెం అడ్డరోడ్డు సమీపంలో అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందిన వివరాల ప్రకారం కొరిశపాడు మండలం, రావినూతల గ్రామానికి చెందిన కారుసాల శ్రీనివాసరావు (58) మరో నలుగురు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదు నుంచి శనివారం స్వగ్రామం రావినూతలకు కారులో బయలుదేరారు. కారు అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై వస్తూ, పుట్టావారిపాలెం అడ్డరోడ్ జంక్షన్‌కు సమీపంలోకి రాగానే ముందు వెలుతున్న ట్రాక్టర్‌ను కారు ఢకొీంది. దీంతో ట్రాక్టర్ రహదారిపైనే తిరగబడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రావినూతల గ్రామానికి చెందిన కారుసాల శ్రీనివాసరావు మతి చెందాడు. మిగిలిన నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రాక్టరు పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం ప్రాంతంలో మాగాని పొలాలలో దమ్ము చేసి తిరిగి తమ స్వగ్రామమైన కావలి వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి ఎస్‌ఐ పట్టాభి రామయ్య చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.