11మంది పై కేసు నమోదు

Jun 8,2024 20:40

ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని తూడెం పంచాయితీ రీసుపేటలో జరిగిన కొట్లాట కేసులో ఇరువర్గాలకు చెందిన 11మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిఐ ఎ. రవికుమార్‌ తెలిపారు. ఈ గ్రామంలో వైసిపి, టిడిపి గ్రూపుల మధ్య శుక్రవారం రాత్రి కొట్లాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు వర్గాల వారు పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ గ్రామంలో వివాదం జరగడంతో పోలీసులు పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఎటువంటి వివాదాలు జరగకుండా ఉండేందుకు ఈ పికెట్‌ ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. ఇప్పటికే గుడివాడ, రాజపులోవ గ్రామాల్లో ఎన్నికల కౌంటింగ్‌ రోజు నుంచి పికెట్‌ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్‌ రోజు సాయంత్రం వైసిపి, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు రీసుపేటలో కూడా పికెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసినందున ఎటువంటి వివాదాలకు వెళ్ల రాదని అన్నారు. కేసుల్లో ఇరుక్కుపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

➡️