ప్రజాశక్తి – కడప కడప నగరంలోని విజ్‌డం పాఠశా లలో మూడవ తరగతి అమీనా అంత ర్జాతీయ ఫిడే రాపిడ్ రేటింగ్ సాధించింది. అమీనా రేటింగ్ (1407) ను ఫిడే సంస్థ రేటింగ్ లిస్టులో ప్రకటించింది. చెన్నై నగరంలోని రాయపేటలో నిర్వహించిన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ లీడర్ ఫీడర్ రాపిడ్ రేటింగ్ టోర్నమెంటులో రేటెడ్ క్రీడాకారుడు మీద అమీనా విజయం సాధించి ఈ రేటింగ్ ను దక్కించుకున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారి తెలిపారు. అమీనా రేటింగ్ సాధించడం పట్ల జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి మరియు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.