పట్టుపురుగుల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

ప్రజాశక్తి – బేస్తవారిపేట: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామంలో పట్టుపురుగుల కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పట్టుపురుగులు పెంపకం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సెరికల్చర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకంతో రైతులు చాలా నష్టపోతున్నారని గతంలో ప్రభుత్వం కిలోకి రూ.50 అదనంగా ఇచ్చేవారని, ఇప్పుడు ఆ స్కీమును ఎత్తివేసారన్నారు. తిరిగి అదనంగా ఇచ్చే పథకాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, సెరికల్చర్‌ ఏడీ నారాయణరెడ్డి, ఎంపీడీవో టి.పార్వతి, డిప్యూటీ తహశీల్దార్‌ పర్వీన్‌, వ్యవసాయ అధికారి మెర్సీ, ఈఒఆర్‌డి రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, విఆర్‌ఒ శివారెడ్డి, సచివాలయ సెరికల్చర్‌ అధికారి సరస్వతి, రైతులు పాల్గొన్నారు.

➡️