ప్రజాశక్తి – పార్వతీపురం : మహాత్మా జ్యోతీరావు పూలే వర్థంతి సందర్భంగా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆయన చిత్ర పటానికి పూలమాలను వేసి, జ్యోతిని వెలిగించి నివాళ్లు అర్పించారు. అనంతరం డిఐపిఆర్‌ఒ, కలెక్టరేట్ సిబ్బంది ఆయన చిత్రపటం వద్ద పూల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. పూలే వర్థంతి కార్యక్రమం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం, మహిళల విద్య, అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో స్త్రీజనోద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహౌన్నత వ్యక్తి పూలే అని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి ఎస్.కృష్ణ, డిపిఆర్‌ఒ లోచర్ల రమేష్, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలకొండ : జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ పాలవలస రాజశేఖరం స్వగృహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ జ్యోతిరావుపూలే సేవలు మరువలేనివాని, ఆయన ఎందరికో ఆదర్శనీయులని కొనియాడారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ ఛైర్మన్లు రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్, పట్టణ వైసిపి అధ్యక్షులు వెలమల మన్మధరావు, వైస్ ఎంపిపి కణపాక సూర్యప్రకాష్, కౌన్సిలర్లు దుప్పాడ పాపి నాయుడు, కడగల వెంకటరమణ, బాబీ, నగర పంచాయతీ మాజీకమిషనర్ ఎద్దు లిల్లీ పుష్పనాధం, చ్రిన్ని , మరియదాస్, పైల వాసు పాల్గొన్నారు.పూలేకు నివాళి సాలూరు : ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర పూలమాల వేసి నివాళులు అర్పించారు.త న నివాసం లో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు వైసిపి నాయకులు పూలే కి నివాళులర్పించారు. మహిళా అక్షరాస్యత ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్,పట్టణ జెసి ఎస్ కన్వీనర్ గిరిరఘు, పట్టణ నాయకులు హరి బాలాజీ, పిరిడి రామకష్ణ, ఎం.అప్పారావు పాల్గొన్నారు .