సమగ్రంగా చర్చించేనా?

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఉమ్మడి జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పాలకుల్లో చిత్తశుద్ధి కొర వడింది. శనివారం జడ్‌పి చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 72 నుంచి అనుబంధ విభా గాలను కలుపుకుని 102 శాఖలు ఉండగా, కేవలం 11 నుంచి 15 శాఖ లకు చర్చను పరిమితం చేయనుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లా వ్యవసా యాధారిత ప్రాంతం. జీవనాధారమైన రంగంపై సమగ్రంగా చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా రబీ సీజన్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న నకిలీ విత్తన నివా రణ, బుడ్డశనగ ధరల తగ్గుదల, అన్నదాతా సుఖీభవ నిధుల జమ, క్రాప్‌ ఇన్సూ రెన్స్‌ వంటి సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక. సాగునీటి పారుదల, విద్య, వైద్య రంగాలు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు జిల్లా ప్రగతిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. జిజిహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ విభాగాలకు వైద్య నిపుణులు, నర్సింగ్‌ సిబ్బంది, టెక్నీషియన్స్‌ కొరతపై దృష్టి సారించాలి. ఉక్కు పరిశ్రమ, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ నిర్మాణ పనులపై చర్చిం చాల్సి ఉంది. కొప్పర్తి పైప్‌లైన్‌ పనుల పురోగతిని ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో వరి రైతు నకిలీ విత్తన సమస్యతో సతమతమవుతున్నారు. రవి తర్వాత ప్రధాన ఆహార పంట బుడ్డశనగ. జిల్లాలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేయడం తెలిసిందే. ఇటువంటి ప్రధాన పంట దిగు బడుల తోపాటు మార్కెట్లో ధరల తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వమే కొను గోలు చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉరుముతోంది. అన్న దాతా సుఖీభవ, సబ్సిడీ డ్రోన్ల పంపిణీ వ్యవహారం తేల్చాలి. విద్యకు సంబం ధించిన ఫీజురీయింబర్స్‌మెంట్‌, తల్లికి వందనం పథకాల నిధుల జమ చేయ డంపై నిలదీయాల్సిన అవసరం ఉంది. వైద్యరంగానికి వస్తే జిజిహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ విభాగాలకు వైద్య నిపుణులు, నర్సింగ్‌ సిబ్బంది, ఆధునిక పరికరాల ఆపరేటర్ల నియామకం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అన్న మయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ, శ్రీనివాసపురం రిజర్వాయర్ల పనులను పూర్తి చేయాల్సి ఉంది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2, హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువల పనులకు మోక్షమెప్పుడో తేలాల్సి ఉంది. కడప కార్పొరేషన్‌లో దేవునికడప రహదారి విస్తరణ పెండింగ్‌, నాలుగు స్ట్రోమ్‌ డ్రెయిన్‌ పనులపై చర్చించాల్సిన అవసరం ఉంది. గండికోట, సోమశిల నిర్వాసితుల మొరను ఆలకించాలి. సర్వరా యసాగర్‌, బ్రహ్మసాగర్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని లింగాల కాల్వ లీకేజీ, యురేనియం పైప్‌లైన్‌ పనుల నత్తనడకను సమీక్షించాలి. 2021 నవంబర్‌ వరదల్లో అన్నమయ్య రిజర్వాయర్‌ మట్టికట్ట తెగిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీలో పురోగతి కొరవడింది. యర్రబల్లి-పార్నపల్లి పైప్‌లైన్‌ పనుల ఆలస్యం కారణంగా యురే నియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవు తుందో తెలియలేదు. గండికోట నిర్వాసితులకు రూ.ఏడు లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.మూడు లక్షలను అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. ఉక్కు పరిశ్రమ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఉక్కు పనుల పురోగతిపై సందేహం నెలకొంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ వైఫల్యం జిల్లాకు శాపంగా మారింది. 2024 ప్రథమార్థంలో జెఎస్‌డబ్ల్యూ చేపట్టిన ఉక్కు పరిశ్రమ పనుల్లో ఎటువంటి కదలిక కనిపించడం లేదు. రూ.150 కోట్ల కొప్పర్తి పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రక్రియ ఎప్పటికి పూర్తవు తుందో తెలియడంలేదు. ఐసిడిఎస్‌ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో మగ్గుతున్నాయి. ఐసిడిఎస్‌ జిల్లా అధికారులు అంగన్వాడీ భవన నిర్మాణాలను చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జడ్‌పి నిధుల నుంచి చేపడతామన్నా ముందుకురాని పరి స్థితి నెలకొంది. జిల్లాలోని సుమారు 17 నుంచి 18 షాదీ ఖానాల అద్దె వసూళ్ల గోల్‌మాల్‌పై పెదవి విప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా పరిషత్‌ పాలకవర్గం జిల్లా సమగ్రాభివృద్ధిపై సమగ్రమైన చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

➡️