పాఠశాలకు కంప్యూటర్ ప్రింటర్ బహుకరణ

Apr 15,2025 18:18 #Konaseema

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : మండల కేంద్రమైన కపిలేశ్వరపురం శ్రీసర్వారాయ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంగళవారం కంప్యూటర్ , ప్రింటర్, యుపిఎస్ బాక్స్ బహుకరించారు. కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి 1975-76 10 వ తరగతి బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గుత్తుల సోమశేఖరం వారి తల్లిదండ్రులైన గుత్తుల కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి, సోదరుడు శ్రీనివాస్ ల జ్ఞాపకార్థం సుమారు 60 వేలు విలువ చేసే వీటిని పాఠశాల హెచ్ఎం వంగాశ్రీనివాస్ కు సోమశేఖరం దంపతులు అందజేశారు. పాఠశాలకు కంప్యూటర్ అవసరాన్ని హెచ్ఎం శ్రీనివాస్ సోమశేఖర దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి వీటిని పాఠశాలకు బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె తాతారావు, పశు వైద్యాధికారి వి వి రమణమూర్తి, పాఠశాల హెచ్ఎంవంగా శ్రీనివాస్ ఎస్ఎంసి చైర్మన్ కొప్పిశెట్టి సతీష్, రిటైర్డ్ టీచర్ కుప్పాల సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

➡️