మృతిప్రజాశక్తి – కడప అర్బన్/ చింతకొమ్మదిన్నె నగరంలోని అప్సర థియేటర్‌లో జూ నియర్ ఎన్‌టిఆర్ నటి ంచిన దేవర చిత్రం విడు దల సందర్భంగా విషా దం చోటు చేసుకుంది. సినిమా చూస్తు ండగా ఓ అభిమాని ఒక్కసారిగా కుప్పకూ లాడు. వెంటనే అతన్ని హుటాహుటినా ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. వివరాలు.. నగరంలోని అప్పర థియేటర్‌లో అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారు జామున ఫ్యాన్స్ షో వేశారు. అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. ఇందులో భాగంగా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లెకు చెందిన ఎన్‌టిఆర్ అభి మాని మస్తాన్ (26) సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తున్న క్రమంలో ఈలలు, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తోటి ప్రేక్షకులు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. గుండెపోటుతో మృతిచెందాడని పేర్కొ న్నారు. ఎంతో ఉత్సాహంగా తన అభిమాన హీరో సినిమా ‘దేవర’ చూసే ందుకు వెళ్లిన వ్యక్తి ఇలా హఠన్మరణం చెందడం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది. మృతుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతిచెందడంతో కుటుం బంతోపాటు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రదర్శన సమ యంలో అభిమానుల రచ్చ.. కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న రాజా థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఫ్యాన్స్ షో గురు వారం అర్ధరాత్రి ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున జూని యర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకున్నారు. చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో యాజమాన్య ంకు, అభి మానులకు మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో పోలీ సులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో గొడవ సద్దు మణిగింది. ఈక్రమంలో చాలామంది యువకులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
