అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

ప్రజాశక్తి -ఖాజీపేట మండల పరిధిలోని బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన రైతు పత్తి రామచంద్రారెడ్డి(41) అప్పులబాధ తాళలేక పురుగుల మందు తాగి బుధవారం పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు పత్తి రామచంద్రారెడ్డి తన సొంత పొలం రెండున్నర ఎకరాతో పాటు ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వరి, వివిధ రకాల పంటలను సాగుచేశారు. కొన్నేళ్లుగా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. దిక్కు తోచక ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.15 లక్షల వరకు అప్పు ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మక్ష్మిఋతుడు రామచంద్రారెడ్డికి భార్య శిరీషతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం స్పందించి మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

➡️