మొబైల్‌ షాపులో అగ్నిప్రమాదం

May 14,2024 12:24 #Fire Accident, #mobile shop

ప్రజాశక్తి-కాజులూరు (కాకినాడ) : కాజులూరు మండల కేంద్రమైన కాజులూరు జిల్లా పరిషత్‌ పాఠశాల ఎదురుగా ఉన్న మొబైల్‌ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం … మంగళవారం తెల్లవారుజామున జిల్లా పరిషత్‌ పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామానికి చెందిన బలబద్రుని కామేష్‌ మొబైల్‌ షాప్‌ లో ఈరోజు తెల్లవారుజామున గంటల సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మొబైల్‌ షాప్‌ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. షాపు నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు షాపు యజమాని ఇంటికి సమాచారం అందించారు. అతను వచ్చి షాపు షట్టర్‌ తెరిచేలోపు షాపు పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యింది. షాపులో ఖరీదైన మొబైల్స్‌, స్మార్ట్‌ వాచీలు, జిరాక్స్‌ మిషన్లు ఇటీవల అమర్చిన ఎయిర్‌ కండిషన్‌ ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదవడంతో ఆస్తి నష్టం రూ.15 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. కాకినాడ ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపు చేశారు.

➡️