ప్రజాశక్తి- గాజువాక :ఉచిత ఇసుక పాలసీనికూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని 76వ వార్డు గాంధీనగర్ సచివాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం రాంబాబు, డి రమణ మాట్లాడుతూ ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులుఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు యార్డుల్లో పుష్కలంగా ఇసుక నిల్వలు ఉండేవని, మూడు నెలల్లో అంతా ఖాళీ చేసిన నేపథ్యంలో ఆ ఇసుక ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలన్నారు. దీనిపై సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు జి.లక్ష్మి, రామచంద్ర నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు అర్జున్, రాజారావు, త్రినాధరావు, రాము పాల్గొన్నారు.
ధర్నాలో మాట్లాడుతున్న రాంబాబు