ఘనంగా పోలీసుల స్పోర్ట్స్‌ మీట్‌

Nov 28,2024 20:49

ప్రారంభించిన డిఐజి గోపీనాధ్‌జెట్టి, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-విజయనగరంకోట :  పోలీసుల 31వ వార్షిక క్రీడాపోటీలను గురువారం స్థానిక జిల్లా పోలీసు క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ రేంజ్‌ డిఐజి గోపీనాథ్‌జెట్టి, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ క్రీడాజ్యోతిని వెలిగిం,ఇ శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వారినుద్దేశించి డిఐజి మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా శారీరక ధృడత్వం కలిగి ఉండాలని, అందుకోసం క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. ఫిజికల్‌ ఫిట్నెస్‌తో పాటు మెంటల్‌ ఫిట్నెస్‌ కూడా అవసరమన్నారు. ఈ క్రీడల్లో గెలుపోవటములు ముఖ్యం కాదని, పాల్గొనడమే ముఖ్యమని అన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ మూడేళ్ల తరువాత స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నామన్నారు. అందరూ ఒకచోట కలిసినప్పుడు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. టీం ని ఎలా నడిపించుకోవాలి, గెలిపించుకోవాలి అనే వాటిపై చర్చించుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం 400 మీటర్ల పరువు పందేలను డిఐజి ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ తృతీయ విజేతలకు మెడల్స్‌ సర్టిఫికెట్‌ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎఎస్‌పి సౌమ్యలత, ఎఆర్‌ అడిషనల్‌ ఎస్‌పి నాగేశ్వరరావు, పలువురు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️