ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మాజీ జడ్పిటిసి సభ్యులు ఆకుల జయసింహ 11వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జయసింహ కుటుంబ సభ్యులు పలువురు నాయకులు, ఆకుల కుటుంబ అభిమానులు తదితరులు ఘన నివాళి అర్పించారు జయసింహ సోదరుడు స్థానిక టిడిపి నాయకుడు ఆకుల విజయకుమార్ (బాబు) ఆధ్వర్యంలో సెవెన్ హిల్స్ కళ్యాణ మండపంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జయసింహ భౌతికంగా మన నుండి దూరమై 11 సంవత్సరాలు అవుతున్న ఆయన చేసిన మంచి పనులతో ఆకుల కుటుంబ అభిమానులు, నిరుపేదల గుండెల్లో ఎల్లకాలం చిరంజీవి లానే ఉంటారని అన్నారు జయసింహ స్ఫూర్తితోనే ఆకుల కుటుంబ సభ్యులందరూ ముందుకు సాగుతారని అన్నారు అనంతరం జయసింహ ఘాట్ వద్ద పూలమాలలు వేసి టెంకాయ కొట్టి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఆకుల కుటుంబ సభ్యులు మాజీ కోఆప్షన్ సభ్యులు సలేహ, వార్డు సభ్యులు నాగభూషణం, మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ నలపురెడ్డిపల్లి రమేష్ ఇస్మాయిల్ రామాంజనేయులు, పవన్ కుమార్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
