బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయికు ఘన నివాళి

ప్రజాశక్తి, మండపేట (కోనసీమ) : సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండపేటలో ఘనంగా నిర్వహించారు. సంఘం జాతీయ క్రమశిక్షణ చైర్మన్‌ కోన సత్యనారాయణ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా అద్యక్షుడు వీరమల్లు శ్రీనువాస్‌, కోన మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం శ్రమించిన సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. మహిళాభ్యుదయానికి, అణగారిన వర్గాల్లో జీవితాల్లో వెలుగు నింపేందుకు కఅషి చేసిన ఆదర్శమూర్తి ఫూలే అని కొనియాడారు. ఈకార్యక్రమంలో జిల్లా గౌరవ అద్యక్షులు పెంకే గంగాధర్‌, సంఘ నాయకులు విన్నకోట రాధాకృష్ణ ప్రసాద్‌, తీగిరెడ్డి మహేష్‌, పంపన శ్రీనువాస్‌, ఒంపోలు పోలరాజు, సందక వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️