డైట్‌లో ముగిసిన ‘హ్యాపీనెస్‌ ప్రోగ్రాం’

హ్యాపీనెస్‌ ప్రోగ్రాం'

ప్రజాశక్తి- అనకాపల్లి : స్థానిక దాడి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (డైట్‌) అటానమస్‌ కళాశాలలో ప్రపంచ ప్రఖ్యాత గురుదేవ్‌ రవిశంకర్‌ స్థాపించిన ఆర్ట్‌ అఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఫాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం శనివారంతో ముగిసింది. ‘హ్యాపినెస్‌ ప్రోగ్రాం ఫర్‌ టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌’ కార్యక్రమంలో భాగంగా డైట్‌ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ప్రాణాయామం, సుదర్శన క్రియ, ప్రతి ఒక్కరూసంతోషంగా జీవించడానికి కావాల్సిన విధి విధానాలను ఆర్ట్‌ అఫ్‌ లివింగ్‌ ట్రైనర్లు రాఘవేంద్ర, హరీష్‌, పద్మ నేర్పించారు.ముగింపు సమావేశంలో డైట్‌ చైర్మన్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ, తమ కాలేజీలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.వైకుంఠరావు మాట్లాడుతూ పండిట్‌ రవిశంకర్‌ వసుదైక కుటుంబం నినాదం యావత్తు ప్రజానీకానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ, శ్వాస, ధ్యానం, యోగా అధ్యయనంతో ఒత్తిడిని జయించి, సంతోషంగా ఉండొచ్చన్నారు. అనంతరం ఆర్ట్‌ అఫ్‌ లివింగ్‌ ట్రైనర్లు రాఘవేంద్ర, హరీష్‌, పద్మలను కళాశాల చైర్మన్‌ రత్నాకర్‌ జ్ఞాపిక బహూకరించి శాలువాతో సన్మానించి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.దుర్గ శ్యాంప్రసాద్‌, డీన్‌ అకడమిక్స్‌ డాక్టర్‌ కె.పార్వతి, డీన్‌ అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌. ఈశ్వరరావు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ కృష్ణనాగ్‌, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు హేమంత్‌ కుమార్‌, మైత్రి పాల్గొన్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ట్రైనర్స్‌ను సత్కరిస్తున్న రత్నాకర్‌

➡️