వానతో నేలకూలిన భారీ చెట్టు

Jun 10,2024 23:47

ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలో సోమవారం కురిసిన వర్షానికి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. సమయానికి అక్కడ ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న చెట్టు కూకటి వేళ్లతో పెకలించుకుని పడిపోయింది. చెట్టు ఉన్న ప్రాంతంలో మున్సిపాలిటీ ట్యాప్‌ ఒకటి ఉండటం, సదరు ట్యాప్‌లో నిత్యం నీరు లికేజి ఆవుతుండటంతో ఆ ప్రాంతం మెత్తగా మారి చెట్టు పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. మున్సిపల్‌ సిబ్బంది రంగంలోకి దిగి చెట్టును తొలగిస్తున్నారు.

➡️