బస్సును ఢీకొట్టిన లారీ – మహిళకు తీవ్రగాయాలు

విజయనగరం : వెనుకనుండి ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌ పక్కసీటులో కూర్చున్న మహిళకు తీవ్రగాయాలైన ఘటన సోమవారం విజయనగరంలో జరిగింది. భూసైవలసు దాటిన తర్వాత ఆరిక తోటకి మధ్య వచ్చేసరికి ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎదురుగా పక్క సీటులో కూర్చున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె బస్సులో చిక్కుకుపోయి తీవ్రగాయాలతో గగ్గోలుపెట్టింది. ఆమెను కాపాడేందుకు స్థానిక యువత, మోటారు కార్మికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గాయాలపాలై బస్సులో చిక్కుకున్న మహిళని జేసీబీ సాయం తో బస్సు శకలాల తొలగించి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఒక కాలు విరిగిపోయినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళ బండపల్లికి మండలం గరుడబిల్లి కు చెందిన రెడ్డి మహాలక్ష్మిగా గుర్తించారు.

➡️