పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని వ్యక్తి మృతి

Nov 13,2024 10:27 #hit by a train, #man died

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చీరాల మండలం విజయనగర కాలనీ బుధవారం వేకువ జామున జరిగింది. అందిన వివరాల మేరకు విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న తేళ్ళ మార్క్‌ (48) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో కూలి పని నిమిత్తం ఇంటి నుండి ఊరికి వెళుతుండగా రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు విజయవాడ నుండి ఒంగోలు వైపుకు వెళుతున్న రైలు ఢీకొట్టిందని బంధువులు తెలిపారు. ఈ ఘటనలో మార్క్‌ అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకొని రోదించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, నవ్యశ్రీ, మహేష్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

➡️