స్నానానికి బావిలో దిగి వ్యక్తి మృతి

Jun 8,2024 21:35

 ప్రజాశక్తి -మక్కువ : మండలం లోని ఎస్‌.పెద్ద వలసకు చెందిన వడ్డే నాగేశ్వరరావు (53) స్నానానికి బావిలోకి దిగి మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పి.నరసింహమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం నాగేశ్వరరావు శుక్రవారం ఇంటి వద్ద నుండి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతాకారు. ఈ సందర్భంగా పాత కామిడివలస వద్ద నేలబావిలో మృతదేహం తేలియాడడం కనిపించడంతో గట్టుపై ఉన్న బట్టల ఆధారంగా నాగేశ్వరావు మృతదేహంగా గుర్తించారు. దీంతో అతని కుమారుడు చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. నాగేశ్వరరావు మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

➡️