బాలికను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

Feb 7,2025 23:03

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : బాలికపై కన్నేసిన దుర్మార్గుడు కొన్ని రోజులుగా వెంటపడి వేధించడంతోపాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చివరికి బాలిక ఫొటోను మార్ఫింగ్‌ చేసి, అసభ్యకరమైన ఫొటోలను బాలిక సెల్ఫోన్‌కు పంపి, వాటిని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ కేసులో నిందితుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు వివరాలను మంగళగిరి రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ శుక్రవారం వెల్లడించారు. రూరల్‌ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌ కథనం ప్రకారం..మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు కుటుంబీకులు హైదరాబాద్‌ వెళ్తూ వారి ఇంటి ముందున్న వ్యర్థాలను తొలగించే పని నిమిత్తం పారిశుధ్య కార్మికుని కోసం ఫోన్‌ నంబర్‌ను ఇంటి ముందు రాశారు. నవులూరుకు చెందిన, ప్రస్తుతం ఎర్రబాలెం ఇండిస్టియల్‌ ఏరియాలో ఉంటున్న బాష ఆ నంబర్‌ను సేకరించి తొలుత బాలిక తల్లితో తర్వాత బాలికను బెదిరించాడు. 10 రోజుల నుంచి బాలిక వెంటపడి బెదిరిస్తూనే ఉన్నాడు. లేచిపోదామని వేధించేవాడు. బాలిక ఫొటోలోని తల భాగాన్ని నగ చిత్రలకు మార్ఫింగ్‌ చేసి వాటిని బాలిక సెల్‌ఫోన్‌కు పంపించేవాడు. ఈ వేధింపులను తట్టుకోలని బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా ఇది తెలిసిన తండ్రికీ గుండెపోటు వచ్చింది. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుణ్ణి శుక్రవారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

➡️