ప్రజాశక్తి – బుచ్చయ్యపేట (అనకాపల్లి జిల్లా) : స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్.భీమవరం, పెదపూడి అగ్రహారం గ్రామాల నుండి ఇటీవల గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలతో సమావేశమయ్యారు.వారు సమర్పించిన అర్జీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు.సమస్య పరిష్కారానికి ఇరు వర్గాలతో మాట్లాడారు.ఈ సమావేశంలో ఎంపీడీవో వి విజయలక్ష్మి,అడిషనల్ ఎస్సై ఎన్ భాస్కరరావు, డీటి మురళీధర్, అధికారులు పాల్గొన్నారు.
