ప్రజాశక్తి-కార్వేటినగరం..వెదురుకుప్పం (చిత్తూరు) : సినీమా పేరుతో ఓ మైనర్ బాలిక పై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కార్వేటినగరం మండలంలో గత ఆదివారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్.ఐ రాజమార్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. మండలంలోని ఒక దళితవాడకు చెందిన ఓ యువకుడు సదరు మండంలోని మరో దళితవాడకు చెందిన మైనర్ బాలికను ఆదివారం రాత్రి తమిళనాడులోని పల్లిపట్టులో సినిమాకు తీసుకెళుతున్నట్లు మాయ మాటలు చెప్పి బాలికను నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మీడియాకు తెలిపారు.