ఐద్వా ఆధ్వర్యాన ర్యాలీ
ప్రజాశక్తి -ములగాడ: మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఐద్వా విశాఖ జిల్లా కార్యదర్శి వై.సత్యవతి పిలుపునిచ్చారు. మంగళవారం మల్కాపురం సిఐటియు కార్యాలయంలో ఐద్వా మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలపై హింసకు వ్యతిరేకంగా బి.మమత అధ్యతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ, మహిళలపై వివిధ రూపాల్లో హింస జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. మహిళలపై హింసలేని సమాజ సాకారానికి కృషి చేద్దామన్నారు. ఐద్వా జోన్ కార్యదర్శి ఆర్.విమల మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరకడంతో యువత వాటికి బానిసలై పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో .ఐద్వా జోన్ నాయకులు వై.కల్యాణి, బి.రాజేశ్వరి, పి.వరలక్ష్మి, అన్నపూర్ణ, బి.లక్ష్మి, నిర్మల, అరుణ, విజయ, ఆదిలక్ష్మి, కళావతి గోవిందమ్మ పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యాన ర్యాలీ