సత్తాచాటిన పంగులూరు ఎడ్ల జత

ప్రజాశక్తి – పంగులూరు : పాత గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామంలో విగేశ్వర స్వామి వార్షిక ఉత్సవాలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల స్థాయిలో ఎడ్లకు బండలాగుడు పోటీలు నిర్వహి ంచారు. ఈ పోటీల్లో పంగులూరు ఎడ్ల జత ద్వితీయ స్థానం సాధించింది. సోమవారం రాత్రి నిర్వహించిన పోటీలో పంగులూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి రవికుమార్‌ యూత్‌ సారధ్యంలో చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత పోటీలో పాల్గొన్నాయి. పది క్వింటాళ్ల బండను 15 నిమిషాల్లో 39,023 అడుగుల లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పురు షోత్తపట్నంకు చెందిన ఎడ్ల జత 33 అడుగుల తేడాతో ప్రథమ స్థానాన్ని సాధించినట్లు తెలిసింది. రెండవ బహుమతి సాధించిన పంగులూరు ఎడ్ల జత గత సంక్రాంతి పండుగకు అన్నం బొట్లవారిపాలెంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలు, రెంటచింతలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ బహుమతిని సాధించినట్లు ఎడ్ల యజమాని చిలుకూరి నాగేశ్వరావు తెలిపారు.

➡️