ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : సోమల మండలం పేటూరు పంచాయతీ ఇర్లపల్లి సమీపంలోని మామిడి టమోటా పంటలపై జంట ఏనుగులు నాలుగు రోజులుగా దాడులు చేస్తున్నాయని రైతులు వాపోయారు. గురువారం ప్రజాశక్తితో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చిట్టి అనే రైతుకు చెందిన మామిడి తోటలపై ఏనుగులు దాడులు చేసి కొమ్మలు విరిచివేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయని తెలిపారు. నాలుగు రోజుల్లో ఇర్లపల్లి పేటూరు, కనికల చెరువు ప్రాంతాలలో తిరుగుతూ రాత్రి వేళల్లో పంట పొలాల పై దాడులు చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. అటవీ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ఫలితం లేకుండాపోతోందని ఇలాగే కొనసాగితే తాము సారవంతమైన భూములను కూడా బీడు భూములుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
