గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రజాశక్తి – రణస్థలం (శ్రీకాకుళం) : గుర్తు తెలియని వాహనం ఢకొీని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రణస్థలంలోని జె.ఆర్‌.పురం పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. 16 వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢకొీని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌.ఐ. కె.గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళుతున్న రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని మృతి చెందిన వ్వక్తి వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ఎడమ చేయి మోచేయిపై నాగీసు-రుప అను పచ్చబొట్టు, ఎడుమ పక్క ఛాతిపై అమ్మ అనే పుచ్చబొట్టు, కుడి మోచేయిపై రూప అనే పచ్చబొట్టు ఉన్నాయని, నలుపురంగు లోవరు, మెరూన్‌ నలుపు డిజైన్‌ షర్టు, మెడలో నల్లని తాడుతో రుద్రాక్ష ఉందని చెప్పారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే 6309990850 ఈ నెంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌.ఐ. కోరారు.

➡️