రచ్చకెక్కిన ‘కూటమి’పోరు

Nov 28,2024 21:35

గు షిణిలో టిడిపి, జనసేన కార్యకర్తల ఘర్షణ

ప్రజాశక్తి-నెల్లిమర్ల : టిడిపి, జనసేన కూటమిలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న టిడిపి, జనసేన గ్రూపుల పోరు రచ్చకెక్కింది. గుషిణి గ్రామంలో ఆ రెండు పార్టీల కార్యకర్తలు బహిరంగంగా ఘర్షణకు దిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?మండలంలోని గుషిణి పంచాయతీకి పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఈ పనులను జనసేన నాయకులకు కేటాయించి, తమను పక్కన పెట్టినట్లు టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు పనులు చేయవద్దని టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గుషిణి దళిత కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. దీంతో టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని, తమకు భాగస్వామ్యం ఇవ్వకుండా ఎలా పనులు చేస్తారని అడ్డుతగిలారు. దీంతో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి పనులు నిలిపేశారు.

➡️