ప్రజాశక్తి – ఆరిలోవ : 60 ఏళ్లమహిళకు ఆరిలోవ, హెల్త్ సిటీలోని ఒమెగా ఆసుపత్రి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించి సోమవారం ఆసుపత్రి సమావేశం మందిరంలో విలేకర్లతో మాట్లాడుతూ, అచ్యుతాపురానికి చెందిన 60 ఏళ్ళ మహిళ ఏడాదిగా తీవ్రకడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంది. ఒమెగా ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఆమెకు స్కానింగ్ రక్త పరీక్షలు నిర్వహించారు. కడుపులో గడ్డ ఉన్నట్టు గుర్తించి, అండాశయం కేన్సర్‌గా నిర్ధారించారు. ట్యూమర్ మొత్తం సుమారు 8 కిలోల బరువు కలిగి ఉండగా, అది మొత్తం కడుపును ఆక్రమించి పేగు భాగాలను, ఎడమ మూత్రనాళంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర కడుపు నొప్పికి కారణమైనట్లు నిర్థారించారు. ఈ నెల 23న ఎన్‌టిఆర్ సేవా పథకం కింద శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ శృతి, ఎనస్థీషియన్స్ డాక్టర్ విజరుకుమార్, డాక్టర్ అనూషలతో కూడిన వైద్యనిపుణుల బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి, కణితను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం మహిళ కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఒమెగా ఆసుపత్రి వైద్యులు