చిన్నారులతో రిస్క్‌ జర్నీ …!

Dec 11,2024 18:00 #chittore, #Risk journey, #with children

వెదురుకుప్పం (చిత్తూరు) : ప్రమాదంతో కూడిన ప్రయాణాల వార్తలను తరచూ చూస్తూ వింటూ ఉంటాం… అలా రిస్క్‌ చేసి ప్రమాదాల బారినపడినవారూ లేకపోలేదు..! ఓవర్‌ లోడ్‌ తో ప్రమాదం అటు వాహనదారుడినీ, ఇటు ప్రయాణీకులను ప్రమాదంలో పడేస్తుంది.. ఇలా … అధికారులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ పెడచెవినపెట్టి వారు రిస్క్‌లో పడుతూ ఇతరులను రిస్క్‌లో పెట్టే ప్రబుద్ధులున్నారు..! ఇందుకు ఈ చిత్రమే నిదర్శనం. వెదురుకుప్పం మండలం, చవటగుంట కూడలిలో బుధవారం ఉదయం ఏకంగా నలుగురు స్కూల్‌ విద్యార్థులను తన బైక్‌ పై ఎక్కించుకొని వాహనదారుడు తాపీగా వెళుతున్నాడు. విశేషమేమిటంటే .. చివర కూర్చున్న చిన్నారి సగం బైటనే ఉంది.. చిన్న బ్రేక్‌ పడినా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఇలా చిన్నారుల ప్రాణాలను ప్రమాదపుటంచుల్లో పెడుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న ప్రజాశక్తి కెమెరాకు ఈ ఫోటో చిక్కింది.. ఇంకేముంది ఆ బైక్‌ వెళ్లేలోపే క్లిక్‌ మనిపించింది..!

➡️