ప్రజాశక్తి- రాయచోటి పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవ నాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బి.సి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో జిల్లా అభివద్ధి సమీక్షా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరు, మదనపల్లె ఎమ్మెల్యేలు అవర శ్రీధర్, షాజహాన్‌బాష, ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు, జెసి ఆదర్శరాజేంద్రన్, డిఎఫ్‌ఒ జగన్నాథ్‌సింగ్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డిఆర్‌ఒ మధుసూదన్‌రావు, ఆర్‌డిఒలు, టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పిజిఆర్‌ఎస్, రీ సర్వే 1, 2 దశలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఆర్డబ్ల్యూఎస్, గనులు భూగర్భం, గహ నిర్మాణం, డ్వామా, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్, పర్యాటకం, పాఠశాల విద్య, నైపుణ్యాభివద్ధి, అటవీ, పరిశ్రమలు, టిడ్కో, చేనేత జౌళి, ఎపిఎస్‌పిడిసిఎల్, జాతీయ రహదారులు, జల వనరులు, డిఆర్‌డిఎ, పౌరసరఫరాలు-దీపం2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ ప్రజారోగ్యం, సహకారం, ఎక్సైజ్, రవాణా, సంక్షేమం, కార్పొరేషన్స్ తదితర శాఖల అంశాలపై చర్చించారు. సమావేశం ప్రారంభంలో కలెక్టరు మాట్లాడుతూ నూత నంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వస్తున్నామని చెప్పారు. జిల్లా మంత్రి తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సహకారంతో జిల్లా అభివద్ధికి కషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకున్న చర్యల కార్యాచరణ నివేదికను సభ్యులకు అందజేశామన్నారు. అభివద్ధి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివద్ధికి అంకితభావంతో అందరం కషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా సమగ్ర అభివద్ధి సాధనకు సమన్వయంగా కషి చేద్దామన్నారు. జిల్లాకు తనను ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించి తనపై పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించేందుకు సహక రించిన జిల్లా ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున కతజ్ఞతలు తెలిపారు. పింఛన్లు పంపిణీ, పిజిఆర్‌ఎస్ అర్జీల పరిష్కారం, జాబ్ మేళాల నిర్వహణ, రీ సర్వే, ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు, పల్లె పండుగ పనులు, సూక్ష్మ నీటిపారుదల, తదితర ఎన్నో అంశాలలో అన్నమయ్య జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను నాలుగు నియోజకవర్గాలను ఎన్‌డిఎ కూటమికి అందించిన కార్యకర్తల సంక్షేమం ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్దినెలలకాలం లోనే ఏవైతే ప్రజలకు అందాలో సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. గ్రామసీమల్లో వెలుగులు నింపడానికి పల్లె పండుగ కార్యక్రమంలో రోడ్లు డ్రెయినేజీలు తాగునీటి సౌకర్య కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో సుమారు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నార. రాయచోటి నియోజకవర్గంలో వేసవిలో నివారణకు కషి చేస్తుందన్నారు. ఆరు మండలాల్లో నీటి సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ జిల్లాలో టమోటా, మామిడి ఎక్కువ ప్రాసెసింగ్ కౌల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. హార్టికల్చర్ హబ్‌గా చేయడానికి సహకారం అవసరమని చెప్పారు. ప్రభుత్వ నేతత్వంలో విద్య, ఐటీ రంగాల అభివద్ధి చెందడంతో పాటు రాయల సీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు.
