కామ్రేడ్‌ లూకయ్యకు ఘన నివాళి

ప్రజాశక్తి- చీరాల : ఉద్యమ రంగంలోనూ, ఉపాధ్యా యుడి సేవలు అందించి ఎందరో విద్యార్థు లను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దిన యుటిఎఫ్‌ మాజీ జిల్లా కార్యదర్శి, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షుడు పి. లోకయ్య సేవలు మరువలేనివి అని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌.గంగయ్య అన్నారు. హరీష్‌ పేటలో కామ్రేడ్‌ లూకయ్య మూడవ సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చీరాల మున్సిపల్‌ పరిధిలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయ వత్తిని కొన సాగిస్తూ మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత లూకయ్య అని తెలిపారు. నేటితరం యువతకు గుర్రం జాషువా జీవిత చరిత్ర తెలియజేయాలనే సంకల్పంతో గుర్రం జాషువా సాహితీ సంస్థను ఏర్పాటు చేసి సాహితీ పుస్తకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి లూకయ్య తన గొప్పతనాన్ని చాటారన్నారు. లూక్య్య వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్న ఎందరో విద్యార్థులు నేడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. లూకయ్య అనేక రంగాలలో సేవలు అందిం చినట్లు తెలిపారు. గుర్రం జాషువా సాహితీ సంస్థ వ్యవ స్థాప కులుగా, జన విజ్ఞాన వేదిక పట్టణ ఉపాధ్యక్షుడిగా అనేక రంగాలలో సేవలందించారు అన్నారు. తొలుత లూయ్య చిత్ర పటానికి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో లూకయ్య సతీమణి కరుణ కుమారి, కుమారుడు శరత్‌ చంద్ర, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జడ వినరు కుమార్‌, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌. బాబూరావు, పి.కొండయ్య, వసంత రావు, ఎల్‌.జయరాజు, యుటిఎఫ్‌ నాయకులు జానీ బాషా, కుర్రా శ్రీను, పిచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.

➡️