పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలు మండలం అల్లీనగరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గురువారం 2005-06 బ్యాచ్‌ 10వ తరగతి పూర్వ విద్యార్థుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాటి సంగతులను నెమరు వేసుకున్నారు. ఆ విద్యా సంవత్సరం తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల క్రితం తాము పదో తరగతి వరకు ఈ పాఠశాలలో చదివామని అప్పటి మధుర స్మతులు, తీపి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని, వాటిని నెమరు వేసుకొని ఆనందిస్తున్నామని ఆ కలయిక తమకు గర్వకారణంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఈనాటి కలయిక మరపురానిదని వారు పేర్కొన్నారు. విద్యా బోధన చేసిన గురువులకు భక్తితో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ సహకారాలు అందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి గురుస్వామిని కూడా భక్తితో సన్మానిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గురుస్వామి, భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణ ఎన్డీఎల్‌ నారాయణ, రఘురాం, వి కుమార్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ బాలాజీ, రసూల్‌ బి, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ ఆంజనేయ చౌదరి, రవికుమార్‌, ఎంవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️