తాడిచెట్టు పైనుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి

May 20,2024 10:32 #died, #falling, #palm tree, #stonemason

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : తాడిచెట్టు పై నుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం కొమరగిరిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం … మండలంలోని కొమరగిరి శివారు వెంకటరాయపురం చెందిన కల్లుగీత కార్మికుడు శీలం లక్ష్మణరావు (53) ఈరోజు ఉదయం కల్లు గీసేందుకు తాడిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి కింద పడిపోయాడు. పడిన వెంటనే అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన లక్ష్మణరావుకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు కొత్తపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

➡️