నీట్‌ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

జమ్మలమడుగు రూరల్‌ : నీట్‌ – 2024 ఫలితాలు, నీట్‌ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు నుండి అనేక అను మానాలు వ్యక్తమ వుతు న్నందున పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ఎన్జీవో కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లా డుతూ 2024 నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్టిఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పార దర్శకత పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నీట్‌ పరీక్ష ఫలితాల్లో ఒకే పరీక్ష కేంద్రం గల ఒకే సీరియల్‌ నెంబర్లతో కూడి ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి నంద్యాల తులసీశ్వర యాదవ్‌, జిల్లా కమిటీ సభ్యుడు ప్రసాద్‌, పట్టణ సహాయ కార్యదర్శి మహేష్‌ పాల్గొన్నారు.

➡️