శిశు గృహానికి మూడు రోజుల చిన్నారి

ప్రజాశక్తి-రాయచోటి పట్టణంలోని సుండు పల్లె రోడ్డులో కెటిసి కల్యాణ మండపానికి ఎదురుగా గల ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గహానికి బుధవారం మూడు రోజుల చిన్నారి చేరింది. జిల్లా పరిధిలోని మొలకలచెరువు మండలం, ఉమాశంకర్‌కాలనీ వద్ద గల ఆదర్శ పాఠశాల వెనుక భాగంలో ఉన్న గుట్టల్లో మూడు రోజుల చిన్నారిని ఎవరో బ్యాగులో పెట్టి వదిలి వెళ్ళిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు, ఐసిడిఎస్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బ్యాగులో ఉన్న చిన్నారిని పట్టణంలోని శిశు గహానికి తరలించారు.చిన్నారిని ఎవరైనా అపహరించి అక్కడ వదిలారా లేక పోషించలేక ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ వదిలి వెళ్లారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారి క్షేమంగా శిశు గహానికి చేరడంతో ఐసిడిఎస్‌ అధికారులు చిన్నారికి సంబంధించిన వారు ఎవరైనా నెల రోజుల్లో వచ్చి పాపను గుర్తించి తీసుకెళ్లవచ్చునని తెలియజేశారు. అలాకాని పక్షంలో పాపను అనాథగా గుర్తించి ఎవరికైనా దత్తత ఇవ్వడం జరుగుతుందని ఐసిడిఎస్‌ పీడీ రమాదేవి తెలిపారు.

➡️