ఎపి జెన్కో ఇఇ లకీëనారాయణకు సన్మానం

ఎపి జెన్కో ఇఇ లకీëనారాయణకు సన్మానిస్తున్న ఇంజనీర్లు, కార్మికులు

ప్రజాశక్తి -సీలేరు

జీకే వీధి మండలం సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విధులు నిర్వర్తించిన ఏపీ జెన్కో ఈఈ లక్ష్మీనారాయణను నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు ఏపీ జెన్కో ఉన్నతాధికారులు బదిలీ చేసిన నేపథ్యంలో బుధవారం లకీëనారాయణను ఘనంగా సన్మానించారు. లకీëనారాయణ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో 2022లో ఈఈగా విధులలో చేరారు. లకీëనారాయణను జెన్కో ఉన్నతాధికారులు నెల్లూరు కృష్ణపట్నం ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు బదిలీ చేయడంతో బుధవారం ఆయన ఇక్కడ రిలీవయ్యారు. ఆయన స్థానంలో విజయవాడలో ఈఈగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ను సీలేరు జలు విద్యుత్‌ కేంద్రానికి జెన్కో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఇక్కడి ఈఈ రాజేంద్రప్రసాద్‌ స్థానిక ఏపీ జెన్కో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. లకీëనారాయణ బదిలైన నేపథ్యంలో సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఇంజనీర్లు, కార్మికులు బుధవారం సన్మాన సభ ఏర్పాటు చేసి దుస్సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరికైనా బదిలీలు తప్పవన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు కార్మికులతో పనిచేసిన క్రమంలో తన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, కార్మికులు పాల్గొన్నారు.

➡️