నీరుగారుతున్న ‘ఉద్యాన’ లక్ష్యం

ప్రజాశక్తి-సింహాద్రిపురం పండ్ల తోటల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఉద్యాన విస్తరణ పథకం గత ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు కేటాయింపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన వన పంటలు విస్తరించాలని లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ పథకానికి నిధులు కేటాయింపు జరగకపోవడంతో లక్ష్యం నీరుగారి పోయింది. గత ఐదేళ్లుగా కేవలం అరకొరగా మాత్రమే నిధులు కేటాయించారు. అర్హత కలిగిన రైతులకు పథకం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చీనీ, నిమ్మ, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి లాంటి తోటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహంగా సాగు చేసే రైతులకు ఆర్థిక సహాయం అందేది. టమోటా, కలింగర, లాంటి స్వల్పకాలిక పంటలలో మల్చింగ్‌ సీట్‌ వేసుకునే రైతులకు సైతం ప్రోత్సాహం లభించేది. మరింత విస్తీర?ంలో పంట సాగుకు ఉపయోగకరంగా ఉండేదని రైతులు చెబుతున్నవారు. గతంలో నూతనంగా చీనీ, నిమ్మ సాగు చేసే రైతులకు రెండు సంవత్సరాలకు కలిపి హెక్టార్‌కు రూ.16,004, అరటికి హెక్టర్‌కు రెండు సంవత్సరాలకు కలిపి రూ.40,700, దానిమ్మకు మూడు సంవత్సరాలకు కలిపి రూ.18 వేలు, బొప్పాయికి రెండు సంవత్సరాలకు రూ.25 వేలు చొప్పున ప్రోత్సాహం కింద రైతులకు ప్రభుత్వం అందించేది. ఈ పథకం నీరుగారిపోవడంతో సాగు చేసే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఉద్యాన వన తోటల రైతులు కోరుతున్నారు.విస్తారంగా అరటి సాగు కొన్ని సంవత్సరాల నుంచి వేరుశనగ, పొద్దుతిరుగుడు లాంటి వాణిజ్య పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర నష్టాల కారణంగా ఉద్యానవన పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. మండల వ్యాప్తంగా ఈ ఏడాది 450 హెక్టార్లలో అరటి సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో అరటి మొక్కలు ధరలు పెరగడంతో పాటు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో పథకం పునరుద్ధరణ చేపడితే మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన రైతులు చెబుతున్నారు. అరటి కాయలు విదేశాలకు ఎగుమతి కారణంగా రాష్ట్ర జిడిపి సైతం పెరిగే అవకాశం ఉందని కావున ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని పథకాన్ని పునరుద్ధరణ చేయాలని రైతులు కోరుతున్నారు.కొత్తగా సాగు చేసే రైతులకు కాస్త ఊరట అరటి సాగు చేసే రైతులకు ఈ పథకం కాస్త ఊరటగా ఉంటుంది. ఇటీవల కాలంలో అరటి సాగు పెట్టుబడి వేయడం ఖర్చులు భారీగా పెరిగాయి. కావున ప్రభుత్వాలు తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరణ చేసినట్లయితే కాస్త ఊరటగా ఉంటుంది.- రవిశంకర్‌, అరటి రైతు, గురజాల.చీనీ, అరటి రైతులకు ఎంతో ఉపయోగకరం నూతనంగా అరటి, చీనీ సాగు చేసే రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఉద్యాన విస్తరణ పథకం కింద పండ్ల తోటల రైతులు ఎంతో లబ్ధి పొందేవారు. ఈ పథకంలో అరకొరగా ఇవ్వడంతో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ పథకాన్ని పునరుద్ధరణ చేయాలి.- అనిల్‌ కుమార్‌రెడ్డి, చీనీ రైతు, బలపనూరు.

➡️