మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

Jun 9,2024 21:48

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : మండలంలోని కృష్ణపల్లి పంచాయతీ చెరువుగట్టు కాలనీకి సంబంధించిన చింతాడ కుమారి (42) వివాహిత శుక్రవారం రాత్రి తల్లి మందలించిందని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆదివారం ఆమె మృతి చెందినట్లు రూరల్‌ ఎస్సై దినకర్‌ తెలిపాశారు. ఆమెకు వివాహమైనా భర్త లేనప్పటికీ ఒక కుమారుడితో తన తల్లి ఇంట్లో నివసిస్తుంది.

➡️