మత్తు పదార్థాలు విక్రయిస్తున్న మహిళ అరెస్టు

ప్రజాశక్తి బాపట్ల : యువతను మత్తుకు బానిసలను చేసే విధంగా టాబ్లెట్ల రూపంలో రహస్యంగా మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఓ మహిళను ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బాపట్ల ఎక్సైజ్‌ సీఐ పి. గీతిక తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల మండలం మండలం వెదుళ్ళపల్లి లో ఓ మహిళ తన గహంలో వైద్యులు నొప్పు లకు వాడే మందు బిళ్ళలను యువతకు అధిక మొత్తంలో విక్రయిస్తూ పట్టుబడింది అన్నారు. ఈ మందులు మత్తు కలిగించేందుకు మాత్రల రూపంలో ఇంజక్షన్ల రూపంలో యువతకు ప్రధానంగా విద్యార్థులకు మత్తులో ముంచేత్తే ఈ మాత్రలను రహస్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు. వీటిని విక్రయిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని ఆమె విక్రయిస్తున్న టాబ్లెట్లను స్వాధీనం చేసుకుని జిల్లా డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్‌ కు అప్పగించినట్లు సీఐ గీతిక తెలిపారు. నొప్పులకు వైద్యులు వినియోగించే ఈ మాత్రలు అధిక మోతాదులో ఉపయోగిస్తే మెదడుపై దాని ప్రభావం చూపుతూ శరీరంపై మత్తు ప్రభావం చూపుతోందని ఆమె తెలిపారు. అది గాక మెడికల్‌ షాపుల్లో విక్రయించే ఈ మాత్రలు 1600 వరకు పెద్ద మొత్తంలో ఆ మహిళ దగ్గర ఉన్నట్లు గుర్తించామన్నారు. అవి మొత్తం స్వాధీనం చేసుకుని డ్రగ్‌ ఇన్స్‌ స్పెక్టర్‌కు అప్పగించామని ఆమె వివరించారు.

➡️