కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి

May 12,2024 14:17

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రొద్దంలో జరిగింది. మండలంలోని పెద్దమంతురు సచివాలయం పరిధిలోని పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన పి.నాగప్ప కుమారుడు వినోద్‌ కుమార్‌ (34) కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️