పట్టాలు దాటుతుండగా యువకుడు దుర్మరణం

Jun 8,2024 21:37

 ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢకొీని ఓ యువకుడు దుర్మణం చెందిన సంఘటన శనివారం చోటుకు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణం బూరాడ వీధికి చెందిన తెంటు భరత్‌ (31) మండలంలోని నర్సిపురం సమీపం విశ్వమాంబపురం జనహిత పాఠశాల వద్ద రైలు పట్టాలు దాటుతుండగా పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్లే గూడ్స్‌ రైలు ఢ కొంది. ఈ సంఘటనలో సంఘటనలో భరత్‌ అక్కడికక్కడే మతి చెందాడు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా, భరత్‌ పట్టణంలోని బూరాడ వీధి కి చెందిన వారని గుర్తించారు. రైల్వే హెచ్‌సి రత్న కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️