ప్రజాశక్తి-కొనకనమిట్ల: గుర్తు తెలియని వాహనం ఢకొీనడంతో వ్యక్తికి తీవ్ర గా యాలైన సంఘటన బుధవారం సాయంత్రం ఎదురాళ్ల పాడు కొత్త ఎస్సీ కాలనీ సమీపంలో 565 జాతీయ రహదా రిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వద్ధిమడుగు గ్రామానికి చెందిన భూదాల నాగరాజ్ మండల కేంద్రం కొనకనమిట్లకు వచ్చి సరుకులు తీసుకుని ద్విచక్ర వాహ నంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢకొీట్టి వెళ్లిపో యింది. దీంతో నాగరాజుకు తలకు బలమైన గాయం అయింది. సమాచారం అందుకున్న 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుడిని వైద్యశాలకు ప్రభుత్వ తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినట్లు బంధువులు తెలిపారు. ఎస్‌ఐ కె.మాధవరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
