ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగు పట్టణంలో ఆధార్‌ అప్డేట్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ కోరారు. ఆ మేరకు మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏఓ వెంకటలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, విద్యార్థులు స్కూల్స్‌, కాలేజీలు, హాస్టల్స్‌లలో చేరాలంటే ఆధార్‌ అప్డేట్‌ అవసరమన్నారు. ఆధార్‌ కేంద్రాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో పోస్టాఫీస్‌, స్టేట్‌ బ్యాంకులో ప్రభుత్వ ఆధార్‌ కేంద్రాలు ఉండేవన్నారు. అధికారులు స్పందించి ప్రజలు, విద్యార్థుల అవస రాలను దృష్టిలో పెట్టుకొని ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు.

➡️