Accident – ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన బైక్‌ – ఒకరికి తీవ్రగాయాలు

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ (కడప) : ఆర్‌టిసి బస్సును బైక్‌ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం పులివెందుల టౌన్‌ నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలం ఇనగలూరు వద్ద పులివెందుల ముద్దనూరు రహదారిపై జరిగింది. స్థానిక వివరాల మేరకు … తొండూరు మండలం టి.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన బండి బాబుల్‌ రెడ్డి ఈరోజు స్వగ్రామం నుంచి తోండూరు వైపుగా బైక్‌ పై బయలుదేరాడు. ఇనగలూరు బ్రిడ్జి వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి ముద్దునూరు వైపు నుంచి పులివెందులకు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ పై ఉన్న బాబుల్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. బైక్‌ పూర్తిగా కాలిపోయింది. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొండూరు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.

➡️