ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : 18 నెలలుగా నగర పాలక సంస్థ లో అభివృద్ది పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. పనులు చేయించుకున్న పాలకులు, అధికారు లు కాంట్రాక్టర్లు కు బిల్లులు చెల్లించకపోవడంతో సుమారుగా రూ.22 కోట్లు పైన బిల్లుల పేరుకుపోయాయి.
దీంతో కాకపోవడం వలన సుమారుగా 18 నెలలుగా రావాల్సిన బిల్లులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన కాంట్రాక్టర్లు లభోదిబో మంటున్నారు. దీంతో బిల్లులు కోసం ఎక్కని మెట్లు లేదు,విన్నవించుకున్నా ప్రజాప్రతినిధి లేరు.బిల్లులు కోసం నగర పాలక సంస్థ అధికారులు చుట్టూ,అదే విధంగా రాష్ట్ర అధికారులు చుట్టూ తిరిగితే తప్ప బిల్లులు అవ్వని దుస్థితి నెలకొంది. గత ఏడాది కాలంగా కాళ్ళూ అరిగేలా తిరిగినా బిల్లులు చెల్లించడం జాప్యం కొనసాగుతూనే ఉంది.దీంతో కనీసం సంక్రాంతి పండగకు అయిన బిల్లు లు వస్తె మమ్మల్ని నమ్ముకున్న కార్మికులు,కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్తితి ఉంటుందని లేకుంటే మాతో కొన్ని వందల కుటుంబాలు సంక్రాంతి పండగ పస్తులతో గడపాల్సిన పరిస్తితి నెలకొందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు బిల్లులు అప్ లోడ్ చేస్తున్నప్పటికీ డబ్బులు విడుదల చేయకపోవడంతో కోట్లాది రూపాయిలు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో బిల్లులు పండగ ముందు వస్తాయో రావోననీ ఆందోళనలో అన్నారు.
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కి వినతి
సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నీ నగర పాలక సంస్థ కాంట్రాక్టర్లు కలిసి మాకు మా బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. బిల్లులు ఇన్ని నెలలు పెండింగ్ ఉండటం వలన తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట అయిన పస్తులు లేకుండా బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మంత్రిని నగర పాలక సంస్థ కాంట్రాక్టర్లు కోరారు. మరి అధికారులు,పాలకులు బిల్లులు చెల్లించి ఆదుకుంటారో లేదా అనేది చూడల్సి ఉంది.