టిడిపి కార్యకర్త హత్య కేసులో నిందితుల అరెస్టు

మహమ్మద్‌ ఖాసిం భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

దుగ్గిరాల: మండలంలోని చిలువూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మహమ్మద్‌ ఖాసిం హత్యకు పాల్పడ్డ తుమ్మపూడికి చెందిన నలుగురు నిందితులను శుక్ర వారం అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ బి.మహేంద్ర తెలిపారు. జూపూడి హర్ష వర్ధన్‌, పోపూరి హృదయరాజు, బోడపాటి కమల తేజ, పల్లం రవీంద్రబాబులను తెనాలి కోర్టుకు హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్‌ విధించారు. నిందితులను కఠినంగా శిక్షించాలిమండలంలోని చిలువూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని మహమ్మద్‌ ఖాసింను హత్య చేసిన నిందితులను కఠి నంగా శిక్షించాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పోతినేని శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం తుమ్మపూడిలో వైసిపి కార్య కర్తల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఖాసిం (24) అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రా మం చిలువూరులో నిర్వహించారు. టిడిపి నాయకులు తోటకూర సీతారామయ్య, నర్ర శ్రీనివాసరావు షేక్‌ నిజాముద్దీన్‌ షేక్‌ జలాలుద్దీన్‌, ఏళ్ల జయలక్ష్మి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ పరి పాల నలో ప్రతిపక్ష నాయకులు ,రాజధాని రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు , టిడిపి కార్య కర్తలు అనేకమంది చంపబడ్డా రని ఆరో పించారు. దుగ్గిరాల మండలంలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అరాచకా లకు పాల్పడుతూ పలువురు చనిపోవ డానికి కారణమయ్యారని ఆరోపించారు. భవిష్య త్తులో ఇటువంటి నేరాలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబాన్ని ప్రభుత్వం, టిడిపి ఎమ్మెల్యే నారా లోకేష్‌ తమ బాధ్యతగా ఆదుకుంటామని చెప్పా రని అన్నారు.మండల టిడిపి అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత మాట్లాడుతూప్రశాంతంగా ఉండే దుగ్గిరాల మండలంలో గత ఐదేళ్లుగా అరాచకం సృష్టిస్తున్నారని, ఇకపై నారా లోకేష్‌ నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిం చొద్దని, క్రమశిక్షణగా మెలగాలని అన్నారు. కుటుంబానికి ఆధారం పోయింది..కుమారుడి మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం ఇంటికి తీసుకురావ డంతో తల్లి మెహర్‌ ఉన్నిసా, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మూడేళ్ల క్రితం అతని తండ్రి షేక్‌ మునాఫ్‌ చనిపోయారు, చెల్లెళ్ల పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. అతనికి పెళ్లి చేసి వరుడిగా చూడాల నుకుంటే,హత్యకు గురయ్యాడు. మహమ్మద్‌ ఖాసిం భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

➡️