వైవీయూ డీన్‌గా ఆచార్య సుబ్బరాయుడు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ యోగి వేమన విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌, లా అండ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌గా ఎంబిఎ ఆచార్యులు వై,సుబ్బరాయుడును నియమిస్తూ విసి ఆచార్య చింతా సుధాకర్‌ నియామక పత్రాన్ని తన చాంబర్లో అందజేశారు. ఇదివరకు డీన్‌గా ఈ స్థానంలో పనిచేసిన ఆచార్య టి.శ్రీనివాస్‌ పదవీకాలం పూర్తవడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నూతన డీన్‌గా నియమితులైన సుబ్బరాయుడు మూడేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అకడమిక్‌, పరిశోధనలపరంగా ఆయా విభాగాల అభివద్ధికి కషి చేయాలని విసి సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.

➡️