గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

మండల పరిషత్తు సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి సూరిబాబు

ప్రజాశక్తి- అనకాపల్లి

గత మూడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. స్థానిక మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు గొర్లి సూరిబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు గైర్హాజరైన అధికారులపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అత్యవసర సేవలైన తాగునీరు, విద్యుత్తు వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. 32 గ్రామపంచాయతీ కార్యదర్శులకు గాను కేవలం పదిమంది హాజరు కావడం పట్ల ప్రజా సమస్యలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తక్షణమే గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌ ఫిర్యాదు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో వైస్‌ ఎంపీపీలు రాము, సూర్యకుమారి, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️