ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : నగరంలో ఉన్న పార్కుల్లో అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన 42వ వార్డులో వాణిజ్య నగర్ పార్కుతో పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో సమస్యలపై చర్చించారు. జననివాసల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.